రోజు రోజుకు పాకిస్తాన్ హద్దులు దాటుతోంది. భారత్ సహనాన్ని పరీక్షించడమే కాకుండా.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాల పై దాడులకు విఫలయత్నం చేసిన పాక్.. ఇప్పుడు దేవాలయాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. జమ్మూలోని ఆప్ శంభు ఆలయం పై పాక్ మిస్సైల్ తో దాడి చేసినట్టు దేవాలయం వెలుపల ఉన్న భవనం ధ్వంసం అయినట్టు సమాచారం. పాక్ ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పాకిస్తాన్ చెందిన రెండు యుద్ధ విమానాలను భారత గగనతల రక్షణ వ్యవస్త ఆకాశ్ నేలకూల్చినట్టు సమాచారం. ముఖ్యంగా భారత గగనతల నియమాలను ఉల్లంఘిస్తూ శ్రీ నగర్ కి వచ్చిన జెట్స్ ను భారత సాయుధ బలగాలు దాడి చేసి కూల్చినట్టు తెలుస్తోంది. వాటి పైలట్లు తప్పించుకోగా.. వారి కోసం వెతుకులాట సాగుతోందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిని భారత బలగాలు అధికారికంగా దృవీకరించాల్సి ఉంది.