ఆసియా కప్ లో భాగంగా నిన్న హాంకాంగ్ మరియు పాక్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రసవత్తర మ్యాచ్ లో పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో సూపర్ 4 కు దూసుకెళ్లింది పాక్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 193 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో మహమ్మద్ రిజ్వాన్ 57 బంతుల్లో 78 పరుగులు చేయగా.. ఫాకర్ జమాన్ 53 పరుగులు చేశాడు. ఖుష్ దిల్ 35 పరుగులు చేసి.. పాక్ కు భారీ స్కోర్ ను అందించారు. ఇక 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంకాంగ్ పూర్తిగా విఫలమైంది.
పాక్ బౌలర్ల బౌన్సర్లకు బలైపోయింది. పాక్ బౌలర్ల ధాటికి కేవలం 38 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది హాంకాంగ్. తద్వారా పాక్ 155 పరుగుల తేడాతో విజయం సాధించింది పాక్. దీంతో.. ఆదివారం రోజున పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ మరోసారి జరుగనుంది.