ఆర్యన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చేసిన పాకిస్తానీ నటి..

-

పాకిస్తానీ నటి సాదియా ఖాన్ తో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ కుమారుడు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది సాదియా..

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గత కొద్దిరోజులుగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు అయితే తాజాగా పాకిస్తానీ నటి మోడల్ సాదియా ఖాన్ తో ఆర్యన్ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఈ విషయం మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు సైతం బయటికి రాగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిందే అంటూ సాదియా తనదైన శైలిలో అసలు విషయం చెప్పుకొచ్చింది..

అసలు ఆ ఫోటో ఎక్కడ తీసుకున్నాము ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా తన గురించి ఆర్యన్ గురించి ఇలా వార్తలు ఎలా రాస్తారు అంటూ ఫైర్ అయింది అంతేకాకుండా ప్రతి విషయానికి ఒక పరిమితి ఉంటుందని తమకు కనిపించిందే నిజం అనుకొని భ్రమపడుతూ ఇలా లేనిపోయిన పుకార్లు పుట్టించడం ఎంతవరకు సమంజసం అంటూ చెప్పుకొచ్చింది నిజంగా ఈ విషయం తనకు విచిత్రంగా అనిపిస్తుందని.. ఫోటో దిగినంత మాత్రాన డేటింగ్ లో ఉన్నామని ఎలా ఫిక్స్ అయిపోతారు అంటూ ప్రశ్నించింది అలాగే అక్కడ తనతో ఫోటో దిగింది నేను మాత్రమే కాదని చాలామంది ఉన్నారని కానీ నా ఫోటో మాత్రమే ఎందుకు ఇంతలా వైరల్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.. అలా ఫోటో దిగిన చాలామంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు వారు ఎవరిని పట్టించుకోకుండా నన్ను మాత్రమే అందరూ టార్గెట్ చేశారు ఇలా నిజ నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం వల్ల పుకార్లు పుట్టించడం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందంటూ తెలిపింది అంతేకాకుండా ఈ ఫోటోలు తాము న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్నామని అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ దుబాయిలో చేసుకున్నామని అక్కడ అనుకోకుండా ఆర్యన్ కాని కలిస్తే ఇలా ఫోటోలు దిగామని చెప్పుకొచ్చింది..

Read more RELATED
Recommended to you

Latest news