మోదీతో కలిసి డిబెట్ లో పాల్గొనాలని ఉందట… పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర ప్రతిపాదన

-

తీవ్రమైన అప్పులు, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా దినదిన గండంగా నెట్టుకొస్తోంది పాకిస్తాన్. పాక ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించేందుకు పాక్ లోని ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. దీంతో పాక్ ప్రధానికి తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సైన్యం, పౌర ప్రభుత్వం మధ్య గ్యాప్ ఏర్పడింది. పాక్ సైన్యాధ్యక్షుడు బజ్వా మరోసారి సైన్యాధ్యుడు కావాలనుకుంటున్నాడు. దీనికి ప్రధాని ఒప్పుకోకుంటే.. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎఫ్ఏటీఎఫ్ కత్తి పాక్ నెత్తిపై వేలాడుతోంది. పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేసేందుకు ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. 

ఇన్ని సమస్యల మధ్య పాకిస్తాన్ ప్రధాని ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి టీవీ డిబెట్ లో పాల్గొనాలని ఉందని ప్రతిపాదన చేశారు. ఈ డిబెట్ భారత ఉపఖండంలో కోట్ల మందికి మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని ఉందన్నారు. భారత్ శత్రు దేశంగా మారడంతోొ వ్యాపారం చేయలేకపోతున్నామని ఆయన అన్నారు. ఇమ్రాన్ ప్రతిపాదనపై భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news