ప్రధాని మోదీకి పార్లమెంట్లో ఘన స్వాగతం లభించింది. మోదీ.. మోదీ అంటూ నినదిస్తూ బీజేపీ ఎంపీలు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క పంజాబ్ మినహా మిగిలిన ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీకి ఘన విజయం దక్కింది. ఈనేపథ్యంలో ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కోసం లోక్ సభలోకి రావడంతోనే బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని తమ కరతాళ ధ్వనులతో, మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తూ ఆహ్వానించారు. ఎంపీలతో పాటు పలువురు మంత్రులు బల్లలు చరుస్తూ.. ఆహ్వానించారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు.
2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సెమీఫైనల్ గా భావించాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే 2024లో కూడా అదే పార్టీ మళ్లీ కేంద్రంలో అధికారం చేపడుతుందని అంతా భావిస్తున్నారు. ఈక్రమంలో యూపీ ఎన్నికలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 273 స్థానాలను సాధించింది. ఇక మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది.
Prime Minister Narendra Modi welcomed by the BJP MPs in Lok Sabha, amid chants of "Modi, Modi", following the party's victory in assembly elections in Goa, Manipur, Uttarakhand, and Uttar Pradesh. pic.twitter.com/IZuF36mDNB
— ANI (@ANI) March 14, 2022