చిరు రాజకీయాల్లో చేయలేనిది పవన్ చేసి చూపిస్తారు.!

-

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  విడుదల కు సిద్ధంగా ఉంది ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు..సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు .ఇక శనివారం విడుదల అయిన ట్రైలర్ కు అధ్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. గంటల్లోనే  మిలియన్ల కొద్దీ వ్యూస్ మరియు లైక్లు వస్తున్నాయి. అభిమానుల్లో రెస్పాన్స్ సూపర్ గా ఉంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అద్భుతంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  విశాఖ పట్టణంలో ఆర్ కే బీచ్ లో  పోలీసులు పర్మిషన్ ఇవ్వక కాన్సిల్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కు మార్చారు. అయినా కూడా విపరీతంగా జనాలు పోటేత్తారు.

ఈ  ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి అన్నయ్య రాజకీయాలు మీకు వన్ అస్సలు కరెక్ట్ కాదు. మీలాంటి మంచి వ్యక్తికి రాజకీయాలు సరిపడవు .అందుకే దేవుడు మీకు ఒక తమ్ముణ్ణి ఇచ్చాడు .. ఆయన మీరు చేయలేని రాజకీయాలు చూసుకుంటాడు  ఆయన దేనికైనా సమాధానం చెబుతాడు.. ఆయన గట్టిగా నిలబడతాడు. మీలోని ఆవేశం మంచితనం కలిస్తే పవన్ కల్యాణ్ ఆయన. మాటకి మాట చెబుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news