ఏపీ రాజకీయాల్లో ఈ సారి పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేలా ఉంది..ఆయన రాజకీయంగా అద్భుతమైన విజయాలు సాధించకపోవచ్చు గాని..వైసీపీ-టీడీపీ గెలుపోటములు మాత్రం పవన్ డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిజానికి గత ఎన్నికల్లోనే పవన్ వల్ల టీడీపీకి భారీ నష్టం జరగగా, వైసీపీకి మేలు జరిగింది. జనసేన వల్ల ఓట్లు భారీగా చీలిపోయి..టీడీపీ గెలవాల్సిన చోట ఓడిపోగా, వైసీపీ ఓడిపోవాల్సిన చోట గెలిచింది.
అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా పవన్…చాలామంది నేతల తలరాతలు మార్చే ఛాన్స్ ఉంది..ఇప్పటికే ఆయన వైసీపీపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే…ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టాలని పవన్ చూస్తున్నారు…అయితే సింగిల్ గా మాత్రం..వైసీపీకి చెక్ పెట్టడం కష్టం…అందుకే ఆయన..టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే..అయితే టీడీపీ కొన్ని త్యాగాలకు రెడీగా ఉంటే పవన్ పొత్తుకు రెడీ అని చెప్పొచ్చు. ఇక చంద్రబాబు సైతం…పవన్ తో కలిసి పోటీ చేస్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నారు.
అనవసరంగా రిస్క్ చేసి సింగిల్ గా పోటీ చేస్తే దెబ్బతింటామని బాబుకు అర్ధమవుతుంది…అందుకే ఆయన కూడా జనసేనతో పొత్తుకు సిద్ధమవుతున్నారు. ఇక చంద్రబాబు-పవన్ గాని కలిస్తే…చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు రిస్క్ లో పడిపోతారని చెప్పొచ్చు. ముఖ్యంగా పలువురు మాజీ మంత్రులు ఓటమి అంచుకు చేరుకున్నట్లే అని చెప్పొచ్చు. టీడీపీకి పవన్ సపోర్ట్ ఇస్తే..మాజీ మంత్రుల గెలుపు కష్టమైపోతుంది.
అలా పవన్ ఎఫెక్ట్ వల్ల రిస్క్ లో పడేవారిలో మాజీ మంత్రి పేర్ని నాని ముందు వరుసలో ఉన్నారు…మచిలీపట్నంలో ఈ సారి నాని గెలుపు కష్టమయ్యేలా ఉంది. ఇక విజయవాడ వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్, ఆచంటలో చెరుకువాడ రంగనాథ రాజు, ఏలూరులో ఆళ్ళ నాని, ప్రత్తిపాడులో మేకతోటి సుచరిత, నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, కాకినాడలో కన్నబాబు, భీమిలిలో అవంతి శ్రీనివాస్…ఈ మాజీ మంత్రులకు పవన్ వల్ల ఓటమి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ-జనసేన కలిస్తే ఈ మాజీ మంత్రులకు గెలుపు కష్టమే.