ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్ర ప్రదేశ్ అప్పులు తక్కువే !

-

అప్పులు బాగా చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. ఏపీ తక్కువగానే అప్పులు చేస్తోందని.. కాగ్‌ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక ఏడాది కంటే.. 2021-22 బడ్జెట్‌ అంచనాల్లో వెల్లడించిన మేరకు కూడా అప్పులు చేయలేదట. అందులో కేవలం 68.04 శాతం మేర మాత్రమే అప్పు చేసినట్లు కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ నివేదిక వెల్లడించింది.

ఆర్థిక ఏడాది మొత్తం ఆదాయ, వ్యయాలను ఆర్థిక ఏడాది చివరి నెల మార్చిలో సర్దుబాటు చేసి.. కాగ్‌.. ఈ నివేదిక రూపొందిస్తోంది. 2021-22 ఆర్థిక ఏడాదిలో కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్‌, రాష్ట్రాలతో పోల్చి.. చూస్తే.. ఏపీలో అతి తక్కువగా ద్రవ్య లోటు ఉన్నట్లు తేలింది.

ఆర్థిక ఏడాది ద్రవ్యలోటు అంటే ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నికర అప్పుగా పేర్కొంటారు.. 15వ ఆర్థిక సంఘట జీఎస్‌డీపీలో 4.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్ధారించగా.. ఏపీ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడగా ద్వారా 2021-22 ఆర్థిక ఏడాదిలో దానిని 2.10 శాతానికే పరిమితం చేసిందని కాగ్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news