ప్రస్తుతం అంతా భీమ్లా నాయక్ మానియా నడుస్తోంది.పవన్ తన కెరియర్లో చేసిన మరో రీమేక్ మూవీ ఇది. మలయాళం సినిమా అయ్యప్పునుమ్ కోశీయుమ్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.ట్రైలర్ టాక్ ఓ మోస్తరుగా ఉన్నా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అదిరిపోయింది.పవన్ సినిమాలకు సాధారణంగా ఉండే క్రేజ్ కన్నా ఎక్కువే ఈ సినిమాకు ఉంది. తొలిసారి ఆయనతో హీరో రానా తెర పంచుకుంటున్నారు. గతంలో గోపాల గోపాల చిత్రంలోవెంకీతో పవన్ కలిసి నటిస్తే, ఇదేఅదే కుటుంబానికి చెందిన రానాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ విధంగా విశేషమే!
ఇక ఓవర్సీస్ లో సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి.అక్కడ నాలుగు వందల థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా నిన్నటి నుంచే థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. కటౌట్లు,ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ సినిమా తమ అంచనాలు మించి ఉంటుందని కూడా పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇదే సమయంలో ట్రైలర్ ను ఇంకాస్త బెటర్ గా కట్ చేసి ఉంటే బాగుండేదన్న వాదన కూడా వినిపిస్తోంది.తమన్ తమను పూర్తిగా నిరాశకు గురి చేశాడని అంటున్నారు వీళ్లు.ట్రైలర్ ఎలా ఉన్నా కూడా సినిమా మాత్రం అదిరిపోవడం ఖాయమని అంటున్నారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 109.50 కోట్ల రూపాయలు చేసిందని తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ రావాలంటే 110 కోట్ల రూపాయల మేరకు వసూళ్లు రాబట్టుకోవాల్సి ఉంది.