Vishwak Sen : విశ్వక్ సినిమాకు క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్

-

అలనాటి హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ చిత్రం లో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ఇందులో కథానాయికగా నటించబోతున్నది. ఇటీవల విడుదలైన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఇప్పుడు మరో సినిమా దక్కించుకున్నారు.

ఇది విశ్వక్ సేన్ కు 11వ చిత్రం కాగా, ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ స్నేహితుడు , టాలీవుడ్ స్టైలిష్ విలన్ జగపతి బాబు కూడా నటిస్తుండటం విశేషం. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.15గా ఈ సినిమాను అర్జున్ యే ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా అర్జున్ కూతురు ఐశ్వర్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి స్టోరి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా యాక్షన్ కింగ్ అర్జున్ యే ఉంటుండటం విశేషం. అయితే.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం అయింది. పవర్‌ స్టార్‌ పవన్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాకు క్లాప్‌ కొట్టి.. షూటింగ్‌ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news