ఇది దివ్య ఖురాన్ అవతరించిన మాసం : పవన్‌

-

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్, రంజాన్ సందర్బంగా శుభాకాంక్షలు తెలియచేశారు. సత్య నిష్ఠ, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగించుకుని, ఈదుల్ ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న వారందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్.

Police issues notices to Pawan Kalyan, asks him to leave Visakhapatnam by 4  PM

దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ఉపవాసాలు, నిత్య ప్రార్థనలతో ముస్లింల లోగిళ్లన్నీ ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంటాయని తెలిపారు పవన్ కళ్యాణ్. మానవత్వ విలువలను ద్విగుణీకృతం చేయాలని చాటిచెప్పే హితవచనాలు మానవాళి మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని ఆయన వెల్లడించ్చారు.

ముఖ్యంగా, రంజాన్ పండుగలో భారతదేశంలో మత సామరస్యం వెల్లివిరుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదని అన్నారు పవన్ కల్యాణ్. ఇఫ్తార్ విందులలో ముస్లింలతో పాటు ఇతర మతస్తులు అధికంగా పాల్గొనడం మనం భారతదేశంలో మాత్రమే ఎక్కువగా చూస్తామని పవర్ స్టార్ వెల్లడించారు. దేశంలోనూ, ప్రపంచమంతటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ, ఇస్లాంపై నమ్మకం ఉన్నవారందరికీ తన తరఫున, జనసేన తరఫున ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పవర్ స్టార్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news