జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కృష్ణ జిల్లాలోని పెడన నియోజకవర్గంలో వారాహి యాత్రలో భాగంగా చేసిన కామెంట్ ల గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా పొత్తుకు సంబంధించి ప్రజలకు మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో వైసీపీని ఓడించడానికి టీడీపీతో పొత్తు పెట్టుకున్న అంటూ మాట్లాడారు. అయితే టీడీపీ తో పొత్తులో ఉంటూనే బీజేపీ పొత్తును కొనసాగిస్తారా లేదా అన్న సందేహం జనసైనికులలో మరియు ప్రజల్లోనూ ఉంది. కానీ ఈ మీటింగ్ తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో మాత్రం బీజేపీ తో కలిసి ఉండదని ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ బీజేపీతో కొనసాగేది లేదు అన్నట్లు కామెంట్ చేశారని రాజకీయ ప్రముఖుకు భావిస్తున్నారు.
ఇది ఇప్పటి వరకు సమాచారంలో ఉన్న ప్రకారం పవన్ బీజేపీని వీడుడతాడనే ఉంది.. కానీ అధికారికంగా పవన్ ఎక్కడ ప్రస్తావించలేదు, మరి ఏమి జరుగుతుంది ఆనంది తెలియాల్సి ఉంది.