పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయి బీజేపీ ఎజెండా మోస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. వక్స్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడంపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బిల్లుకు మద్దతు తెలిపిన ఏపీ నాయకులపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేత మాట్లాడుతూ.. వర్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంశంలో టీడీపీ వాళ్లు కొన్ని సవరణలు చేశామని చెప్పారని, మరి వారి సవరణలు ఆమోదం కానప్పుడు బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ తో పోలిస్తే చంద్రబాబు కొంతమేర నయమేనని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయాడని అన్నారు. కాషాయ బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని పూర్తిగా సనాతన వాదిలా మారిపోయాడని, ఆయన బీజేపీ ఎజెండాను మోస్తున్నాడని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన సనాతని అనిపించుకోవడానికి క్రిస్టియన్ అయిన తన భార్య చేత తిరుమలలో గుండు కొట్టించాడని.. అది ఆయన వ్యక్తిగతం అయినప్పటికీ.. వేరే వాళ్ళను తీసుకోవడం లేదు కదా అన్నారు.