నెట్టింట వైరల్‌ అవుతున్న పవన్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఫోటో

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక యమా స్పీడ్ గా సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. దూసుకుపోతున్నారు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు”. అయితే.. పవన్‌ కల్యాణ్‌ టీం కొన్ని రోజులుగా యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొంటుంది. కాగా ఇపుడు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే ఫొటో ఒకటి బయటకు వచ్చింది. షూటింగ్ లొకేషన్‌లో దిగిన ఫొటో చూసిన అభిమానులు పవన్‌ కల్యాణ్‌ ఫుల్ యాక్షన్‌ మూడ్‌లో కనిపిస్తుండటంతో సంబరాలు చేసుకుంటున్నారు. హరిహరవీరమల్లు అండ్‌ టీంపై వచ్చే హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్లను కొన్ని రోజులుగా రామోజీఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు.

Hari Hara Veera Mallu | ట్రెండింగ్‌లో హరిహరవీరమల్లు న్యూ లుక్‌

హరిహరవీరమల్లులో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు‌‌. క్రిష్‌ టీం ఇప్పటికే రిలీజ్‌ చేసిన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని 2023 సమ్మర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చాలా రోజులుగా పొలిటికల్ కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌.