వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తన్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అసెంబ్లీకి 25 నుండి 40 అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు ఉండదని చెప్పారు. అయితే… ఆ పార్టీకి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ, ఆంధ్రా సమస్యలు వేరన్న పవన్… ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో పాలన కొంత ఫర్వాలేదన్నారు. ఈ రెండింటినీ పోల్చి చూడలేమని అభిప్రాయప్డడారు. ఏపీలో జగన్ ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలన చేస్తోందని ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే ఏపీలో వారాహి వాహనానికి అనుమతి ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. తెలంగాణలో జనసేన పార్టీని దీర్ఘకాలిక దృష్టితో నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.