బీజేపీకి ఓటు వేసి ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నికోవాలి : పవన్ కల్యాణ్

-

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావున మరోసారి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని దుబ్బాక ప్రజలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. గురువారం ఆయన చేగుంటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత బీజేపీకి ఓటు వేసి ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. కలిసికట్టుగా పని చేసి వకీల్‌సాబ్‌ను అసెంబ్లీకి పంపించాలన్నారు.

I Supported BJP To See BC Chief Minister: Pawan Kalyan! | I Supported BJP  To See BC Chief Minister: Pawan Kalyan!

భద్రాద్రి కొత్తగూడెంలో రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనది హ్యమనిజమని చెప్పారు. ఆంధ్రాలో గుండాలను, రౌడీలను ఎదుర్కొని నిలబడ్డానంటే దానికి తెలంగాణ ఉద్యమ స్పూర్తే కారణమని పునరుద్ఘాటించారు. ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు తనకు ఆదర్శమని.. సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన అని అన్నారు. జనసేన, బీజేపీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనలేదన్నారు. తాను తెలంగాణలో ఉన్నా లేకపోయినా జనసైనికులు మాత్రం ఇక్కడ ఉంటారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news