కొండగట్టుకు రానున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

-

కొండగట్టుకు రానున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. అక్టోబర్‌ మాసంలో రానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ లో తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు పవన్‌ కళ్యాణ్‌. అనంతరం తెలంగాణలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

తాజాగా సరస్వతి దేవిని అర్చించిన పవన్ కళ్యాణ్.. అక్టోబర్ మాసంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలపై ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. తెల్లవారుజామునే హైదరాబాద్ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు అమ్మవారిని అర్చించి తెలుగు రాష్ట్రాలకు సకల శుభాలు కలుగ చేయాలని ప్రార్థించారు. పూజానంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యాలయ నిర్వాహకులతో సమావేశమై అక్టోబర్ మాసంలో పార్టీపరంగా నిర్వహించ తలపెట్టిన సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

మంగళగిరిలో నిర్వహించనున్న పార్టీ సమావేశాలకు సంబంధించి కీలక సూచనలు చేశారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియా – శతఘ్ని క్రియాశీలక సభ్యులతో పవన్ కళ్యాణ్ గారు సమావేశమవుతారు. జిల్లాలవారీగా సమీక్షలు చేపట్టబోతున్నారు. ఈ సమీక్ష సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ అర్బన్ లతో మొదలవుతాయి. నా సేన నా వంతు కార్యక్రమంపై సమీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర యాత్ర నిర్వహణకు సంబంధించి సన్నాహకాలపై ముఖ్య నేతలతో సమాలోచన జరుపుతారు.

Read more RELATED
Recommended to you

Latest news