జనసేనాని పవన్ రాజకీయాలు నేర్చుకోవాలా? ఆయన ఇప్పుడు చేస్తున్న రాజకీయాల్లో కొత్తదనం అంటూ ఏమీ లేదా? అంటే.. ఔననే అంటున్నారు మేధావులు. రాజకీయాలు రెండు రకాలుగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ఒకటి తనను తాను నిలబెట్టుకోవడం, రెండు ప్రత్యర్థులపై పోరు చేయడం. ఈ రెండు విషయాల్లోనూ సమగ్ర దృష్టితో ముందుకు వెళ్తేనే నాయకులు రాజకీయాల్లో రాణిస్తారనే విషయం కొత్తగా వచ్చిందేమీ కాదు. కానీ, ఈ రెండు విషయాలను పక్కన పెట్టి.. తనకంటూ ఎలాంటి అజెండా లేకుండా ఒక పార్టీని, ఆ పార్టీ వ్యూహాన్ని మాత్రమే భుజాల కెత్తుకున్నారనే విమర్శలు పవన్‌పై చాలానే వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికలకు ముందు పవన్ పార్టీ పెట్టారు. అప్పటి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అప్పట్లో ఆయన చెప్పిన మాటలను బట్టి.. వచ్చే ఐదు సంవత్సరాలు.. తాను పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. దీనిని బట్టి 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో గట్టి బలమైన పక్షం ఏర్పాటవుతుందని అందరూ అనుకున్నారు. అయితే, ఆ మధ్య కాలంలో పవన్ అనుసరించిన వైఖరితో పార్టీ బలం పుంజుకోలేక పోయిందనేది వాస్తవం. తన పార్టీలోకి జంపింగులను ప్రోత్సహించనని చెప్పిన పవన్.. యువతకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఈ క్రమంలోనే ఊరూవాడా పరీక్షలు పెట్టి యువతను ఆకర్షించారు. అయితే, ఇంతలోనే ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు.
ఎన్నికల సమయానికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి తన పార్టీలో చేర్చుకుని టికెట్లు కూడా ఇచ్చారు. అదేసమయంలో అధికారంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేయడం మానేసి కేవలం ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని ఆయన టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఇక, బలమైన ఉద్యమం తీసుకువస్తానంటూ చెప్పిన ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు. పాచిపోయిన లడ్డూలతో రాజీ పడ్డారు. చంద్రబాబు నోటి నుంచి వచ్చిన విమర్శలనే తాను కూడా పట్టుకుని వేలాడారనే అపప్రద మోశారు. కట్ చేస్తే.. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయానికి దూరమయ్యారు.
ఇక, పార్టీ తరఫున కేవలం ఒకే ఒక్కరిని మాత్రమే గెలిపించుకున్నారు. దీంతో ఈ ఓటమి నుంచి ఆయన కొన్ని పాఠాలైనా నేర్చుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు మేధావులు. బాబునుఅనుసరించడం వల్ల ఆయన ఇమేజ్‌ను కూడా పోగొట్టుకున్నారనేది వాదన. అలా కాకుండా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ అనుసరించిన విధానం పవన్ కూడాఅనుసరిస్తే.. బాగుండేదనేది వాస్తవం అంటున్నారు. అయితే, ఇప్పటికీ కూడా పవన్ ఎక్కడా మారింది లేదు. ఆయన ప్రజలకు చేరువయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. నిజానికి పవన్ పుంజుకునేందుకు, రాష్ట్రంలో రాజకీయ వాక్యూమ్‌ను తనకు అనుకూలంగా వినియోగించుకునేందుకు చాలా అవకాశం ఉంది. అయితే, ఆయన పసలేని విమర్శలతో పొద్దు పుచ్చుతున్నారని రాజకీయాల్లో ఆయన నేర్చుకో