BREAKING : నేడు విశాఖకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే

-

BREAKING : నేడు వైజాగ్ రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్ ఏ డి ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగు తల్లి ఫ్లైఓవర్,
సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్,బీచ్ రోడ్ మీదగా నోవాటల్ హోటల్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

ఇక రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమం.. ప్రజల నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలు తో సమావేశము ఉండనుంది. సోమవారం ఉదయం ప్రెస్ మీట్, అనంతరం విజయనగరం పార్టీ నేతలు తో సమావేశం కానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news