క్రిష్టమస్ గిఫ్ట్స్ ను వారికే మాత్రమే ఇవ్వనున్న పవన్‌ కళ్యాణ్..

-

పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అటు చేతి నిండా సినిమాలు మరో వైపు రాజకీయాల తో ఫుల్ బిజిగా ఉన్నాడన్న విషయం తెలిసిందే..2024 లో రానున్న ఎన్నికల్లో జనసేన జెండాను ఎగుర వేసెందుకు భారీ ప్లానులు వేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా.. షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం. పవన్ ప్రతి ఏడాది తన కోస్టార్స్ కు తన తోటలో పండిన మామిడిపళ్ళు పంపుతారన్న విషయం తెలిసిందే..

తాజాగా పవన్ కొంతమంది సినీ ప్రముఖులకు క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించారు. మొన్నటివరకు ఫామ్ హౌస్ నుంచి మామిడి పండ్లను పంపించిన పవన్ ఈ మధ్యనే క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీ లో తన స్నేహితులకు.. అభిమానించే వ్యక్తులకు పవన్ క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం మొదలుపెట్టారు. వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీ రామ్ కు పవన్ క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు.

ఈ విషయాన్ని వేణు శ్రీరామ్ సతీమణి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న హరిహర వీరమల్లు సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాధ్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఒక సినిమా చేయాలన్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన వారికి క్రిస్మస్ గిఫ్ట్ లు సెండ్ చేస్తుండడం తో ప్రతి ఒక్కరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news