అసలు పవన్ షూటింగ్ లో ఉంటారా…?

-

నేను సినిమాల్లోకి రానంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల బాట పట్టారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు పిక్ అనే రీమేక్ సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇన్నాళ్ళు రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకుని షూటింగ్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

అయితే అసలు ఆయన షూటింగ్లో పాల్గొంటారని లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమవారం అమరావతి రైతులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే పవన్ కళ్యాణ్ సినిమా రీమేక్ షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నానికే మళ్లీ విజయవాడ వచ్చేసి అక్కడి రైతులకు మద్దతుగా నిలిచారు. పోలీసుల దాడిలో గాయపడిన రైతులను ఆయన పరామర్శించారు.

మంగళవారం జనసేన కార్యాలయంలో పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు, రైతులతో ఆయన సమావేశమై వారి బాధలు విన్నారు. మళ్లీ బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. దీనితో ఆయన అసలు షూటింగ్ జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉండటంతో,

ఆయన అసలు ఏం చేస్తారనేది ఇప్పుడు దర్శకనిర్మాతలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏపీలో అమరావతి ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఈ తరుణంలో అసలు సినిమా షూటింగ్ పాల్గొంటారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. దీనితో ఆయన స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news