గవర్నర్ తమిళిసై కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

-

నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై పుట్టినరోజు సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు బెస్ట్ విషెస్ ను అందజేశారు. రాజకీయ కుటుంబంలో జన్మించి, వైద్యశాస్త్రాన్ని అభ్యసించి, వైద్య వృత్తిలో ఎన్నో విజయాలను చవిచూసిన తమిళి సై గారిని నేటి యువతులకు ఆదర్శమూర్తిగా భావిస్తున్నానని చెప్పారు. వైద్య సేవలు అందిస్తూనే, కుటుంబ నేపథ్యం గా వచ్చిన రాజకీయ రంగాన కూడా ఆమె తనదైన పాత్రను పోషిస్తూ.. నేడు గౌరవప్రదమైన గవర్నర్ స్థాయికి ఎదిగారని అన్నారు.

ఒక్క తెలంగాణకే కాకుండా పుదుచ్చేరికి కూడా ఇన్చార్జి గవర్నర్ గా నియమితులవ్వడం ఆమెలోని పరిపాలనా దక్షతకు నిదర్శనమని చెప్పారు. చిత్తశుద్ధితో ప్రజలకు ప్రేమతో సేవలు అందిస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పడానికి తమిళిసై గారు నిలువెత్తు తార్కాణమని అన్నారు. ఆమెకు ఆ భగవంతుడు శతాయుష్సును ప్రసాదించాలని, ప్రజా సేవ లో ఆమె నిరంతరంగా మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు జనసేనాని.

Read more RELATED
Recommended to you

Latest news