మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను చేసింది. ఇక ఈ జాబితా పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.తన సీటును తాను ప్రకటించుకోలేని దౌర్భాగ్య స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ‘బాలకృష్ణ, లోకేశ్ పేర్లను ప్రకటించారు. కానీ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చంద్రబాబు డిసైడ్ చేయాలి అని ఎద్దేవ చేశారు. బాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి మేనిఫెస్టోను అమలు చేసింది లేదు. పవన్ పార్టీ ఎందుకు పెట్టారో తెలీదు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పలేదు’ అని రోజా మండిపడ్డారు.
ఇవాళ తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.