ఏపీలో పార్టీ బలోపేతానికి జనసేన సంచలన నిర్ణయం తీసుకుంది. జనసేన క్రియాశీలక సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తామని.. 2 వ తేదీన వీర మహిళలకు అవగాహన కార్యక్రమం అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహించబోతున్నామన్నారు.
పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత, వీర మహిళలు చేసిన కృషి అనిర్వచనీయమని తెలిపారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, 3.50 లక్షల మంది క్రీయాశీలక సభ్యులను చేర్చేందుకు జనసైనికులు, వీరమహిళలు చేసిన కృషి అద్భుతమని కొనియాడారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.
పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని… గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎలా పని చేయాలో చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఆరు నెలల్లో ఓ గొప్ప యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామని.. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో ఉండే క్రియాశీలక సభ్యులకు ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు వరుసగా ఉంటాయన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.