ఎన్టీఆర్‌ పేరు కాదు.. దమ్ముంటే విశాఖ కేజీహెచ్ పేరు మార్చండి – పవన్‌ కళ్యాణ్‌

-

ఎన్టీఆర్‌ పేరు కాదు.. దమ్ముంటే విశాఖ కేజీహెచ్ పేరు మార్చండని ఛాలెంజ్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని… ఎన్ఠీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని ఫైర్‌ అయ్యారు. ఎన్ఠీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోయాతాయా? రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవు అనేది వాస్తవమన్నారు పవన్‌ కళ్యాణ్‌.

పేర్లు మార్చాలి అనుకొన్న పక్షంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా అని నిలదీశారు. ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండని సవాల్‌ చేశారు. ఈ పాలకులకు యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరయినా ఈ పాలకులకు తెలుసా? వైద్య విశ్వ విద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఉండి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరును పరిగణించేవారు. బోదకాలు, టైఫాయిడ్ లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త, మన తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులుపెట్టారా? అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news