కేటీఆర్‌ కు పవన్‌ కళ్యాణ్‌ స్పెషల్‌ రిక్వెస్ట్‌..!

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… తెలంగాణ సమస్యలపై దృష్టి సారించారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని పల్లెచేలక్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. విద్యార్థుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆడబిడ్డలు మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్లి చదువుకుంటున్నారని గుర్తు చేశారు.

విద్యాసంస్థలు విడిచిపెట్టాక బస్సులు లేక నడిచి వెళ్లాల్సి వస్తోంది అన్నారు. అటవీ ప్రాంతం కావడంతో చదువుకునే పిల్లలు భయపడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం ఈ సమస్యపై స్పందించి, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు నడపాలని కోరారు. బస్సు సదుపాయం లేదనో, అటవీ ప్రాంతంలో నడిచేందుకు భయపడో విద్యార్థినులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి రాకూడదన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తో పాటు సీఎంఓ, కేటిఆర్ ఆఫీసును ట్వీట్ లో ప్రస్తావించారు. బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ను రిక్వెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news