బాబుకు తోడుగా పవన్..జగన్ ప్లాన్ రివర్స్?

-

ఏపీలో అధికార వైసీపీ..ఎక్కడకక్కడ ప్రతిపక్షాలని దెబ్బకొట్టే విధంగానే రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది…ప్రతిపక్షాలని దెబ్బకొట్టి, వారిని బలపడకుండా చేసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా పనిచేస్తుంది. అయితే అధికార వైసీపీకి చెక్ పెట్టి అధికారం కైవసం చేసుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సొంత బలంతో అధికారంలోకి రాకపోయినా..చంద్రబాబుతో కలిసి అధికారంలోకి రావాలనే ప్లాన్ తో పవన్ కల్యాణ్ ఉన్నారు.

వీరు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే..సమయాన్ని బట్టి వీరు కలిసి రాజకీయం చేస్తున్నట్లు అర్ధమవుతుంది. నిజానికి వీరిని వైసీపీనే కలిసేలా చేసిందని చెప్పవచ్చు. ప్రతిపక్షాలని దెబ్బకొట్టాలని చూసే విధంగా రాజకీయం చేయడంతో ప్రతిపక్షాలే కలిసిపోతున్నాయి. ఇక తాజాగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో..వల్ల ప్రతిపక్షాలు మరింత దగ్గరయ్యేలా ఉన్నాయి. ఇటీవల కందుకూరు, గుంటూరుల్లో టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ఘటనల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది..ఇకపై రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదని జీవో తెచ్చింది. పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లోనే సభలు పెట్టుకోవాలని సూచించారు. ఈ ఆంక్షలు ప్రతిపక్షాలపైనే ప్రయోగిస్తారని, అధికార పక్షానికి ఆంక్షలు పెట్టారనే విమర్శలు వచ్చాయి.

విమర్శలకు తగ్గట్టుగానే తాజాగా రాజమండ్రిలో జగన్ రోడ్ షో జరిగింది..కానీ కుప్పంలో బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే బాబు వెనక్కి తగ్గలేదు. అటు టీడీపీ శ్రేణులు సైతం రివర్స్ అయ్యాయి. పోలీసుల లాఠీ చార్జ్ చేసిన వెనక్కి తగ్గలేదు. ఇక కుప్పంలో బాబుని అడ్డుకోవడంపై పవన్ మండిపడ్డారు.  ఉత్తర్వుల బూచి చూపించి ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారా అని నిలదీసారు. అలాగే ఈ ఉత్తర్వులు ప్రతిపక్షాలకే వర్తిస్తాయా..ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వర్తించవా అని ప్రశ్నించారు. ప్ర

మీరు అధికారంలో లేనప్పుడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా అంటూ పవన్ ఫైర్ అయ్యారు. అయితే ఈ జీవో వల్ల ప్రతిపక్షాలని అడ్డుకుంటున్నారనే భావన జనంలోకి వెళ్లవచ్చు. అలాగే ప్రతిపక్షాలు ఏకమయ్యి..బలపడేలా చేసేలా ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news