వారికి కేంద్రం గుడ్ న్యూస్.. నెలకు రూ.3 వేలు..!

-

కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకు వచ్చింది. ఈ పథకాల ద్వారా చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. దేశంలోని అసంఘటిత కార్మికులకు చక్కటి భవిష్యత్తును ఇవ్వాలని.. ఆర్థిక ఇబ్బందులేమీ లేకుండా ఉండాలని మోదీ ప్రభుత్వం వివిధ స్కీమ్స్ ని ప్రవేశ పెడుతూనే వుంది. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి.

అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈ స్కీమ్ ద్వారా డబ్బులు వస్తాయి. శ్రామికులు, కర్శకులు, వ్యవసాయ కూలీలకు 60 ఏళ్లు దాటిన తర్వాత ఈ డబ్బులని ఇస్తారు. కనీసం రూ. 3000 స్థిర ఆర్థిక సహాయం ని కేంద్రం వీరికి ఈ స్కీమ్ ద్వారా ఇస్తోంది.

ఒకవేళ కనుక పింఛను పొందే సమయంలో చనిపోతే లబ్ధిదారుని భార్య లేదా భర్త పెన్షన్ నుండి యాభై శాతం కుటుంబ పెన్షన్‌గా ఇస్తారు. అయితే ఈ స్కీమ్ కేవలం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకే. ఈ స్కీమ్ లో చేరే వారి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రూ. 15,000 వరకు వారి సంపాదన ఉండాలి.

60 ఏళ్ల వయస్సు వరకు ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు ఈ స్కీమ్ కి విరాళంగా ఇవ్వవచ్చు. ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందాలంటే ఆధార్ కార్డ్ , బ్యాంక్ ఖాతా ఉండాలి. CSC అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందొచ్చు లేదా సెంటర్‌కు కాని వెళ్ళచ్చు. ప్రాసెస్ పూర్తి అయ్యాక శ్రమ యోగి కార్డ్ ఇస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news