టపాసులు పేల్చిన వైసీపీ అభిమానులు… ఎమ్మెల్యే బాబురావు కు తీవ్ర గాయాలు

-

విశాఖ జిల్లాలోని పాయక రావు పేట లో అధికార వైసిపి పార్టీ చేరికల సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పార్టీలో చేరికల సందర్భం గా స్థానిక వైసీపీ అభిమానులు సరదాగా టపాసులు కాల్చారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్టణం పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు కంటికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.. వైసీపీ అభిమానులు టపాసులు పేల్చడం వల్ల… ఆ నిప్పురవ్వలు..  ఎమ్మెల్యే బాబురావు కంట్లో పడ్డాయి.

దీంతో ఎమ్మెల్యే బాబురావు కంటికి తీవ్రమైన గాయమైంది. ప్రస్తుతం ఆయన విశాఖ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పిన వైద్యులు.. కాస్త ఆలస్యం అయితే ప్రమాదమే జరిగేదని  చెప్పినట్లు సంచారం.   టపాసులు కాల్చే సమయంలో అప్రమత్తంగా లేక పోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే… ఈ ప్రమాదం పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news