26న ఖమ్మం జిల్లా లో పిసిసి చీఫ్ రేవంత్ పర్యటన

-

గాంధీ భవన్ లో జిల్లా నాయకులతో సమావేశం కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ టూర్ పై సన్నాహక సమావేశం నిర్వహించారు. అలాగే ఎల్లుండి నుండి జిల్లాల పర్యటనలు నిర్వహించాలని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపు వరంగల్ జిల్లా నాయకులతో పిసిసి సమావేశం జరుగనుంది.

25 న కరీంనగర్ జిల్లాకి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానుండగా.. 26 న ఖమ్మం జిల్లా లో పిసిసి చీఫ్ రేవంత్ పర్యటన ఉండనుంది. ఈ టూర్ లో సిఎల్పీ నేత భట్టి.. రేణుకా చౌదరి.. జగ్గారెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 27న నల్గొండ కు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇది ఇలా ఉండగా రాహుల్ సభ కోసం పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇంఛార్జి ల నియామకం చేశారు. నల్గొండకు గీతారెడ్డి, భువనగిరికి జగ్గారెడ్డి, ఖమ్మంకు కుసుమ కుమార్, మహబూబాబాద్ కు ..శ్రీధర్ బాబు, కరీంనగర్ కు ..షబ్బీర్ అలీ నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news