వైసీపీలో నెంబర్ 3 ఎవరో తెలుసా…?

-

ఆయన మంత్రి కొడుకు, చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీ బలోపేతంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు. యువనేతల్లో జగన్ కి అత్యంత ఇష్టుడు. తండ్రి మీద ఉన్న నమ్మకంతో జగన్ ఎంపీ సీటు ఇచ్చారు. విజయం సాధించారు, రెండు సార్లు ఎంపీ అయ్యారు. ఆయన చెప్పినా జగన్ చెప్పినా ఒకటే. పార్టీలో ఆయనకు అమితమైన స్వేచ్చ ఉంటుంది. ఎవరిని అయినా ఆదేశించే అధికారం కూడా ఆయన సొంతం. రాజకీయ నిర్ణయాలు అయినా సరే స్వేచ్చగా తీసుకునే అధికారం ఉంది.

ఇంతకు ఆయన ఎవరూ అనుకుంటున్నారా…? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఆయన పార్టీలో నెంబర్ 3. తండ్రితో సమప్రాధాన్యం ఉంది ఆయనకు. వైసీపీ లోక్సభా పక్ష నేతగా జగన్ అవకాశం ఇచ్చారు. ఎంపీలు ఎం చెయ్యాలన్నా సరే ఆయన అనుమతి ఉండాల్సిందే. ఆయన మాట దాటి వెళ్ళే అవకాశం ఆ పార్టీలో ఉండదు. రాజంపేట నుంచి ఎంపీగా గెలిచిన ఆయనకు జగన్ మంచి ప్రాధాన్యత ఇస్తారు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఆ పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది.

దీనితో రెండు జిల్లాల్లో కూడా మిథున్ రెడ్డి హవా నడుస్తుంది. అటు తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కూడా జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. రాయలసీమ బాధ్యతలను మొత్తం ఈ ఇద్దరే చూస్తారు. ఇక జగన్ కేబినేట్ లో కూడా పెద్ది రెడ్డి కీలకంగా ఉన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండటంతో జగన్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. యువనేతగా మిథున్ రెడ్డికి జగన్ అవకాశాలు ఇస్తున్నారు. విజయసాయి రెడ్డి తో కూడా ఈ ఇద్దరికీ మంచి సఖ్యత ఉంది. దీనితో పార్టీలో మిథున్ రెడ్డి నెంబర్ 3 అయ్యారని అంటూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news