‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్… ఎప్పుడంటే …..??

-

ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను రాజమౌళి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా,

కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో డివివి దానయ్య ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి హీరోలిద్దరి అఫీషియల్ లుక్స్ కానీ, లేదా ఫుల్ టైటిల్ గాని ఇంకా రివీల్ కాలేదు. మెగా, నందమూరి ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ని డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేయడానికి ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. సరిగ్గా అదే సమయానికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని చాలా రోజుల క్రిందటే రాజమౌళి కూడా ఫిక్స్ అయ్యారట. మరి ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా అని ఎదురు చూపులు చూస్తున్న ప్రేక్షకులకు ఈ వార్త మంచి పండగ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది……!!

Read more RELATED
Recommended to you

Latest news