వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేశారా?. చంద్రబాబు తనదని చెప్పుకోవడానికి ఒక్క స్కీమూ లేదు. ఒక్క ప్రాజెక్టునైనా చంద్రబాబు పూర్తి చేశారా?” అంటూ ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పేరుతో డబ్బులు వసూలు చేశారా లేదా.. ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అని ప్రశ్నించారు. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఇసుక పాలసీ తీసుకు వచ్చింది.. కేంద్ర ప్రభుత్వం కు చెందిన ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లు పిలిచాం అని తెలిపారు. అయితే, 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకం తెచ్చింది లేదని విమర్శించారు. చంద్రబాబు ఇసుక టెండర్ లో పాల్గొనాలి.. 375 రూపాయలు టన్నుకు కేటాయించాం, అదనంగా వంద రూపాయలు మెయింటేన్స్ చార్జెస్ పెంచి 475 కు అందుబాటులో తెచ్చారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం పేరు చెప్పి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేశారా లేదా చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఇసుక తీస్తే 100 కోట్లు ఎన్‌జీటీ ఫైన్ వేసిందన్నారు పెద్దిరెడ్డి.. అధికారులపై చర్యలు తీసుకుంటే.. సెక్రటేరియట్ లో పంచాయితీ చేసి పంపించారు.. ఇసుక పేరుతో నీ పాలనలో దోచుకున్నది ప్రజలకు చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. నువ్వు నీ కుమారుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు ఇసుక తరలించ లేదా..? అని ప్రశ్నించారు. నీ పాలనలో ఉచిత ఇసుక పేరుతో వేల కోట్లు పక్కదారి పట్టాయి.. ఇసుక కాట్రాక్టర్ కు అప్పగించారు, నిర్వహణ బాధ్యత వాళ్లది.. నువ్వు అల్టిమేటం ఇస్తే.. లేని పోని వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.