ఈ స్కీమ్ తో నెలకు రూ.5 వేల పెన్షన్..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటోంది. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ లో చాలా మంది చేరుతున్నారు. అయితే ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన పథకం లో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 65 లక్షల మంది ఈ స్కీమ్‌లో చేరారని పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ PFRDA అంది. ఈ పథకం వాలంటరీ స్కీమ్. ఈ స్కీమ్ లో కనుక చేరితే కనీసం రూ. 1000 పెన్షన్ వస్తుంది. అలాగే గరిష్టంగా రూ.5 వేల వరకు పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్ తో రూ. 1,000, రూ. 2 వేలు, రూ. 3 వేలు, రూ. 4 వేలు, రూ. 5,000 చొప్పున పెన్షన్ వస్తుంది.

ఈ స్కీమ్ లో 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ స్కీమ్ లో చేరచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో చేరచ్చు. ఈ స్కీమ్ లో చేరిన వారు ప్రతీ నెలా డబ్బులు కడుతూ ఉండాలి. 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. అప్పుడు జీవితాంతం పెన్షన్ వస్తుంది.

సబ్‌స్క్రైబర్ మరణిస్తే భాగస్వామికి పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణిస్తే నామినీకి ఫండ్ డబ్బులు చెల్లిస్తారు. ఈ స్కీమ్ లో 18 ఏళ్ల వయసులో వున్నవారు చేరితే రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000కు అయితే రూ.42, రూ.2 వేలకు రూ.84, రూ.3 వేలకు రూ.126, రూ.4 వేలకు రూ.168 కట్టాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version