ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్‌ ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..?

-

ఈ మధ్య కొత్తగా ఇల్లు కట్టిస్తున్న వాళ్ళు వారి అభిరులకు తగ్గట్లు కొత్త కొత్త డిజైన్ లతో అందంగా కట్టిస్తున్నారు.. అందం కన్నా ముందు అన్ని వాస్తు ప్రకారం చెయ్యాలని వాస్తు నిపుణులు అంటున్నారు.. ఎక్కడ పెట్టాల్సినవి అక్కడే పెట్టాలని అప్పుడే సుఖ సంతోషాలతో ఉంటారని వారు చెబుతున్నారు.ఆ ఇంట్లో ఒక రకమైన శాంతిగా అనిపిస్తుంది. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు వాస్తు నియమాలు పాటించి నిర్మాణం చేసుకుంటేనే మంచిది. లేదంటే అనవసరపు అనుమానాలకు కారణం కావచ్చు.

వాస్తు ప్రకారం నిర్మించిన ఇల్లు కలకాలం సుఖశాంతులతో నిండి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తులో నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయంపై చర్చ ఉంటుంది. వాస్తును అనుసరించి కట్టిన ఇల్లు సౌకర్యవంతంగానూ, అందంగానూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పే పనిలేదు..ఒకప్పుడు, ఇప్పుడు కూడా చాలా మంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించాలి..ఇది వరకు రోజుల్లో బాత్రూమ్, టాయిలెట్లు ప్రధాన నివాస స్థలమైన ఇంటికి కాస్త దూరంగా ఉండేవి. కానీ కాలం మారింది. నిర్మాణాలు చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ అటాచ్డ్ బాత్రూమ్ లు నిర్మించుకుంటున్నారు. కనుక కొత్త ఇంటి నిర్మాణం చేపట్టే వారు తప్పనిసరిగా ఈ నియమాల గురించి తప్పక తెలుసుకోవాలి..

బెడ్ రూమ్ లో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ కూడా భార్యభర్తల అనుబంధం మీద ప్రభావం చూపిస్తుంది. పడకగదిలో నిద్రిస్తున్నపుడు పాదాలు బాత్రూమ్ వైపు ఉండకూడదు. ఇలాంటి స్థితి ఉంటే ఇంట్లో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఈ గొడవలు చాలా తీవ్రంగా ఉండి విడాకులకు కూడా కారణం కావచ్చు..

ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. క్రమంగా కుటుంబ ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. బాత్ రూమ్ తలుపు నిద్రించే సమయంలో మూసి ఉండేట్టు చూసుకోవాలి.అటాచ్డ్ బాత్రూమ్ ల వల్ల ఇంట్లో అప్పుడప్పుడు వాస్తు దోషాలు ఏర్పడుతాయి. ఇలాంటి దోషాల నివారణకు ఒక గాజు పాత్రలో ఉప్పు నింపి బాత్రూమ్ లో ఒక మూలన పెట్టాలి. ఈ ఉప్పును వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. తీసేసిన ఉప్పును సింక్ లో ఫ్లష్ చెయ్యాలి. అదే గిన్నెలో మళ్లి కొత్తగా ఉప్పు నింపి బాత్రూమ్ లో పెట్టాలి. ఈ పరిహారంతో బాత్రూమ్ కు సంబంధించిన వాస్తు దోషాలు తొలగిపోతాయి. బాత్రూమ్ లో టాయిలెట్ సీట్ ఎప్పుడూ మూసి ఉంచాలి.. లేకుంటే మాత్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news