ఈ మధ్య కాలంలో పిసిఓస్ సమస్య ఎక్కువ మందిలో వస్తోంది. భారత దేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడే వాళ్ళు బరువును కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. పిసిఓస్ సమస్య ఉన్న వాళ్ళలో ఎక్కువ బరువు పెరిగిపోవడం, బాగా బరువు తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే బరువు తగ్గాలనుకుంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. దీనితో ఈజీగా బరువు తగ్గొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ ఫైబర్ తీసుకోండి :
పీసీఓస్ సమస్యతో బాధపడే మహిళలు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా ఉండవు. కూరగాయలు, పండ్లు మొదలైన వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని రెగ్యులర్ గా తీసుకోండి.
ప్రొటీన్ తీసుకోవడం:
ప్రోటీన్స్ ఆరోగ్యానికి చాలా అవసరం. కనుక డైట్ లో ప్రోటీన్ తప్పకుండా తీసుకోండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్టేబుల్ గా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడతాయి.
తక్కువ తీసుకోవడం:
ఎక్కువ ఆహారంతీసుకొనే బదులు కొద్దిగా కొద్దిగా తీసుకుంటే మంచిది. ఇలా తీసుకుంటే పీసీఓస్ తో బాధపడే వాళ్లకి మంచిది అని నిపుణులు అంటున్నారు.
షుగర్:
షుగర్ ని డైట్ లో తక్కువ తీసుకోండి. పీసీఓస్ తో బాధపడే వాళ్ళు బరువు తగ్గాలనుకుంటే షుగర్ కి దూరంగా ఉండటం మంచిది. వీలైనంత షుగర్ తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే బరువు కూడా పెరిగి పోకుండా ఉంటారు.
వర్కౌట్స్ చేయండి:
ప్రతి రోజూ వర్కౌట్ చేయడం కూడా చాలా మంచిది. బరువు తగ్గడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.