ఉల్లి గురించి మన పెద్దోళ్లు గొప్పమాటే అన్నారు. ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు అని..సామెత బానే ఉన్నా.. ఉల్లి అంతా మేలే కాదు.. కొన్ని నష్టాలు కూడా కలిగిస్తుంది. వంటల్లో ఉల్లిపాయ లేకుండా ఏ కూర చేయరు. ప్రసాదాల్లో పెట్టేవి తప్ప. అలాగే కొందరు ఉల్లిని వంటల్లో వాడరు. అది వారి సంప్రదాయం అనుకోండి.. అయితే ఉల్లిలో ఔషధ గుణాలు. వాడితే మంచిదే.. కానీ ఇదంతా కాయిన్ కు ఒక సైడ్ మాత్రమే.. సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కథ వేరుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అసలు ఉల్లి మంచిదే కాదు. తినకూడదట. మరి అవేంటో చూద్దామా..!
హైపో గ్లైసీమియా అంటే.. షుగర్ లెవల్స్ తక్కువగా ఉండే సమస్యతో ఇబ్బంది పడేవారు ఉల్లిపాయను తినడకూడదట. వీరు ఉల్లిపాయ తినడం వల్ల షుగర్ లెవల్స్ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
శరీరంలో విటమిన్ కె అధికంగా ఉన్నవారు ఉల్లిపాయను తక్కువ తీసుకోవాలట. ఎందుకంటే ఉల్లిలో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డ కట్టెలా చేస్తుంది. శరీరం లోపల రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారు ఉల్లిపాయకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు.. లేదంటే హార్ట్ ఎటాక్ సమస్య తలెత్తవచ్చు..
ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నవారు ఉల్లిపాయను పక్కకు పెట్టడం.. లేదా తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిదగి. దీనిలో ఫ్రక్టోజ్ అధికంగా ఉండడంతో గ్యాస్ ట్రబుల్ సమస్యలు వస్తాయి.
హృదయ సంబంధ సమస్యలతో ఉన్నవారు కూడా ఉల్లిపాయలకు దూరంగానే ఉండాలి. లేదా మొత్తానికి తినడం మానేయాలి. ఎందుకంటే ఉల్లిపాయలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గర్భణీలు కట్ చేసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలను అస్సలు తినకూడదట.
పచ్చి ఉల్లిపాయను తింటే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఉల్లిని తగిన మొత్తంలో వాడుకుంటేనే మేలు చేస్తుకంది. పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు ఉల్లి వాడకం తగ్గించడం ఉత్తమం. మీ వైద్యుల సలహా మేరకు ఎంత వాడాలో, అసలు వాడాలో వద్దో తెలుసుకోగలరు.
-Triveni Buskarowthu