అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాకు క్లారిటీ ఇచ్చిన పేర్ని నాని…

-

వసంత కృష్ణ ప్రసాద్ పై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు పేర్ని నాని . ఇలాంటి దుష్-ప్రచారాన్ని మీడియా గ్రూపుల్లోనూ ఫార్వార్డ్ చేయడం అసభ్యకరం అన్నారు ఆయన. బయట ప్రచారం జరుగుతున్నది అసెంబ్లీలో తమ మధ్య జరిగిన సంఘటన ఒకటి కాదని తెలిపారు నాని. ఉదయం 8:45 గంటలకే హడావిడిగా వచ్చి కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో కూర్చున్నారని, టీ బ్రేక్ సమయం దాకా ఓటేయడానికి వెళ్లలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఓటేయలేదేమని సరదాగా తాను అడిగితే.. ఇప్పుడే వెళుతున్నానని కృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఇది తప్ప ఇంకా అక్కడ జరిగింది ఏమి లేదని స్పష్టం చేశారు నాని. తమ మధ్య జరిగిన సంభాషణ ఇదయితే, సోషల్ మీడియాలో మాత్రం హేయమైన భాషలో దుష్-ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చారు నాని.

Dream of the poor in AP has come true with launch of housing scheme:  Minister Perni Nani

తాను కృష్ణప్రసాద్ ను రాత్రంతా కనబడలేదు ఎక్కడికి వెళ్లారని అడిగినట్లు, దానికి కృష్ణప్రసాద్ తనపై బూతులతో విరుచుకుపడ్డట్లు, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుని ఆయన ఎక్కడికో పోయినట్లుతప్పుడు ప్రచారం జరుగుతోందని నాని అన్నారు. ఇదంతా హేయమైన ప్రచారమని, దీనిని మీడియా గ్రూపుల్లోనూ పార్వార్డ్ చేసుకోవడంతో వివరణ ఇచ్చేందుకే కృష్ణ ప్రసాద్ తో కలిసి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో కృష్ణ ప్రసాద్ తో కలిసి పేర్ని నాని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రచారాన్ని కృష్ణ ప్రసాద్ కూడా తీవ్రంగా ఖండించారు. మీడియా గ్రూపులో స్వయంగా తాను వివరణ ఇచ్చానని తెలిపారు. పేర్ని నాని తనకు సోదరుడని, అన్నా అంటూ వెళితే నిమిషాల్లో ఏ పనైనా చేసి పెడతారని వ్యక్తపరిచారు కృష్ణ ప్రసాద్.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news