BREAKING: రేపు ఏపీ సీఎం జగన్ మీటింగ్ గురించి సీక్రెట్ రివీల్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని ?

-

రెండు రోజుల నుండి సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం జగన్ మీటింగ్ గురించి చర్చ జరుగుతోంది మరియు రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయి… ఆ మంత్రి ఔట్ ? ఈయన కేబినెట్ లోకి వస్తారు ? అంటూ ఊదరగొడుతున్నారు. కానీ రేపు జరగబోయే మీటింగ్ అసలు విషయం ఏమిటన్న సీక్రెట్ ను ఎమ్మెల్యే పేర్ని నాని రివీల్ చేశారు. తాజాగా ఈయన మాట్లాడుతూ రేపు జగన్ తో మీటింగ్ కేవలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీదనే ఉంటుంది. ఇంతకాలం చేసిన ఈ కార్యక్రమం పైన అందరి సలహాలను తీసుకోవడానికి మాత్రమే సీఎం జగన్ మీటింగ్ పెడుతున్నారు. మీరు అనుకుంటున్నట్లు కేబినెట్ గురించి అయితే కాదు.. ఎప్పుడు ఏ మంత్రివర్గం అయితే ఉందో, వారితోనే మేము ఎన్నికలకు వెలుతాము.

ఇందులో ఎటువంటి మార్పులు ఉండబోవు అని తేల్చి చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక జగన్ ఎవరిపై అయినా కొప్పడతారా అన్న ప్రశ్నకు… ఎవరికి అప్పగించిన పనిని వారు చేయకుంటే సీఎం జగన్ వారిని మందలించడంలో తప్పు లేదు అంటూ రేపు జరగబోయే మీటింగ్ సారాంశాన్ని పేర్ని నాని పూసగుచ్చినట్లు చెప్పేశారు.

Read more RELATED
Recommended to you

Latest news