హిందీ చిత్ర పరిశ్రమ బాలీవుడ్లో నెపోటిజంపై ఎప్పటినుంచో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం నేపోటిజం కారణంగానే కొందరు స్టార్స్ అయిపోతున్నారని టాలెంట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ లేని వారు వెనక పడిపోతున్నారని పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం బాలీవుడ్లో నేను ఇబ్బందులు ఎదుర్కోవడంతో భారత్ వదిలేయాల్సి వచ్చిందని చెప్పటం మరొకసారి వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించారు బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్.
బాలీవుడ్ లో ఉన్న నెపోటిజంపై ఎప్పటికీ పలుమార్లు వివాదాలు ఏర్పడ్డాయి. తాజాగా ప్రియాంక చోప్రా “బాలీవుడ్ నన్ను ఒక మూలన పడేసి అవకాశాలు రాకుండా చేసింది. నన్ను చాలా ఇబ్బందికి గురి చేయడంతో అక్కడ నుంచి వచ్చేయాల్సి వచ్చింది” అంటూ తెలిపింది. ఈ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. “ప్రియాంక చోప్రా షారుక్ ఖాన్ తో క్లోజ్ గా ఉండటం నచ్చకే కరణ్ జోహార్ ఆమెపై కక్ష కట్టాడని మూవీ మాఫియా ప్రియాంకను ఎంతగానో ఇబ్బందికి గురి చేసిందని..” తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను వదిలేసి మంచి పని చేసింది లేకపోతే ఆమెకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు పట్టిన పరిస్థితి వచ్చేది అంటూ తెలపడం మరోసారి వివాదం అయింది.
సోషల్ మీడియా వేదికగా ప్రియాంకకు మద్దతు తెలిపిన శేఖర్.. “ప్రియాంక చోప్రా చెప్పిన విషయాలు షాకింగ్‌గా ఏం లేవు. సినీ పరిశ్రమలోని అలాగే నడుస్తుందని అందరికీ తెలుసు. మీరు అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు అక్కడి మాఫియా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అదే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో జరిగింది.. చాలా మందికి ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఇలాగే పరిశ్రమ నుంచి వెళ్లిపోయారు. కాబట్టి దాన్ని తట్టుకోవాలి లేదా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ప్రియాంక వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే హాలీవుడ్‌కి వెళ్లి మంచి పని చేసింది. అయితే హాలీవుడ్ మాత్రం ఇండియాకు ప్రాధాన్యం ఇస్తూనే వస్తుంది..” అంటూ రాస్కొచ్చారు.