రాగిపంట సాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ పద్దతులు

-

మిల్లెట్స్ లో రాగులు పాత్ర చాలా ఎక్కువ.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈమధ్య జనాల్లో.. చిరుధాన్యాల వాడకం విపరీతంగా పెరిగింది.. దాంతో.. రైతులు కూడా వీటిని పండించే పనిలో పడ్డారు. ఒకప్పుడు రాగులు, సజ్జలు, కొర్రలు ఇలా చిరుధాన్యాలను ఊర్లల్లో అందరు రైతులు పండించేవారు.. కానీ కాలక్రమేణా.. వీటిని వాడేవాళ్లు తగ్గడంతో.. సాగు చేయడం కూడా తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు ఓల్డే గోల్డ్ అవుతుంది. పాతపద్దతులే ట్రెండింగ్ అవుతున్నాయి. చిరుధాన్యాలలో ఒకటైన రాగి సాగు ఇప్పుడు బాగా పెరిగింది. రాగి సాగులో వచ్చే చీడపీడలు, తెగుళ్లను తగ్గిస్తే.. మంచి లాభాలు పొందవచ్చు.

రాగిసాగులో వచ్చే తెగుళ్ళు

1.అగ్గి తెగులు ; ఈ తెగులు నారుమడితో పాటు పంటను ఆశిస్తుంది. వర్షపు జల్లులు పడుతూ గలిల్లో అధిక తేమ ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ చేరుకున్నపుడు అగ్గితెగులు ఉద్ధృతి ఎక్కువ అవుతుంది. ఎదిగిన మొక్కల ఆకులు, కణుపులు, వెన్నులపైన దారపుకండే ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి.ఈ మచ్చల చుట్టూ ఎరుపు గోధుమరంగు అంచులు కలిగి ఉంటాయి. కనుపులపై తెగులు ఆశిస్తే కణుపులు విరగడం , వెన్ను పై ఆశిస్తే గింజలు తాలు గింజలుగా మారుతాయి.

నివారణకు

పంట పొలాల్లో కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ముందు జాగ్రత్త చర్యగా విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. తెగులును తట్టుకునే విత్తన రాకలను ఎన్నుకోవాలి. మొక్కలపై అక్కడక్కడ మచ్చలు కనిపించినపుడు లీటరు నీటికి 1 గ్రా. కర్బండిజిమ్ లేదా 3 మీ.లీ. కిటాజన్ మందు వాడకూడదు. నారునాటే ముందు బ్లైటాక్స్ లేదా మంకోజేబ్ మందును 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి ఆ ద్రావణంలో నారును ముంచి శుద్ధి చేసి నాటుకుంటే పంటను మొదటి దశల్లో ఆశించే తెగుల్లనుండి కాపాడుకోవచ్చు. వెదజల్లి విత్తేపద్దతిలో 3 గ్రా. తైరం లేదా కాప్టాన్ కిలో వితననికి కలిపి శుద్ధి చేయాలి.

2. ఆకుమాడు తెగులు: లేత మొక్కల వేర్లు, మొదళ్ళపై తెగులు ఆశించి మొక్కలు కుళ్ళిపోతాయి. ఆకులపై చిన్న అండకారపు లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత ఆకులు ఎండుతాయి.

నివారణకు

తైరం లేదా కాప్టాన్ 3 గ్రా . కిలో విత్తనానికి కలిపి విత్తనాశుద్ది చేయాలి. మంకోజేబ్ 2.5 గ్రా . లీటరు నీటికి కలిపి పైరుకి పిచికారి చేయాలి.

చీడపీడలు :

1.గులాబి రంగు పురుగు : ఈ పురుగు సజ్జ, జొన్న, కొర్ర పంటలను కూడ ఆశిస్తుంది. ఈ పురుగు ముందు రెక్కలు ఎండుగడ్డి రంగులో ఉంటాయి. వెనుక రెక్కలు తెల్లగా ఉంటాయి. బాగా ఎదిగిన లార్వాలు లేత గులాబి రంగులో ఉంటాయి. లార్వాలు కాండాన్ని తొలిచి సొరంగాలు చేసి లోపలి భాగాలను తినడం వలన మొక్క చనిపోతుంది. పంటను కంకి దశలో ఆశిస్తే అవి తెల్ల కంకులుగా మారుతాయి .ఈ లార్వా పురుగులు ఒక మొక్క నుండిఇంకొక మొక్కకు పాకి మొత్తం పంటకు నష్టం కలిగిస్తాయి.

నివారణకు

ఈ పురుగు ఆశించిన మొక్కలను గుర్తించి ఎరివేయాలి. మొక్కల అవశేషాలను కాల్చివేయడం. ద్వారా వీటివల్ల కలిగే నష్టం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి ఒకటి, రెండు శాతం మొక్కల్లో పురుగు ఆసిన్చినపుడు లీటరు నీటికి ఎండోసల్ప్హన్ 2మీ.లీ.కలిపి పిచికారి చేయాలి.

2.శనగ పచ్చ పురుగు : ఇది రాగి పంటని కంకి దశలో ఆశించి పూత, గింజలను తిని నష్టపరుస్తుంది. నివారణకు పురుగు ఆసించినపుడు కంకులను దులిపి లేదా చేతితో ఎరివేసి నాశనం చేయాలి. లీటరు నీటికి 2 మీ.లీ. ఎండోసల్ప్హన్ లేదా 3 గ్రా కార్బరిల్ 50 శాతం పొడి మందు పిచికారి చేయాలి.

3. పేనుబంక: పంట బెట్టకు గురైనపుడు ఇది చాలా ఉద్ధృతంగా ఆశిస్తుంది. చిన్న, పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు, కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే కంకులు రాకపోవడం, గింజలు రాకపోవడం గమనించవచ్చు.
నివారణకు డైమిథోయెట్ 2 మి. లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.

4. చెదలు : రాగి, కొర్ర పంటలను చెదలు ఎక్కువగా ఆశించి నష్టపరుస్థాయి . తేలిక నేలలో, వర్షాభావ పరిస్థితిలో ఈ పంటను పండించినప్పుడు చెదలు ఎక్కువగా వ్యాపిస్తాయి.

నివారణకు పంటల చుట్టూ అక్కడక్కడ ఎత్తుగా కనిపించే పుట్టను నాశనం చేయాలి. ఆ పుట్టల పై భాగంలో రంధ్రం చేసి లీటరు నీటికి 5 మీ.లీ. చొప్పున క్లోరిపైరిఫాన్ మందును కలిపి ఒక్కొక్క పుట్టలో 10 – 12 లీటర్ల మందు ద్రావణం పోయడం ద్వారా చెదలను నివారించవచ్చు. ఈ చెదలు ఎక్కువగా నష్టపరిచే ప్రాంతాల్లో పంటలు వేసే ముందు ఆఖరి దుక్కిలో లిండెన్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పున భూమిపై చల్లి కలియదున్నాలి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news