వరుసగా రెండవ రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు…!

-

పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న పెరిగిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా రెండవ రోజు కూడా ధరలు పెరిగాయి. అయితే ఇది వాహనదారులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్న 80 పైసలు పైన పెరిగిన ధరలు ఈరోజు కూడా దాదాపు అదే స్థాయిలో పెరిగాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

అనుకున్నట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వెళ్తున్నాయి. నిన్న 80 పైసలు పైన పెరిగిన ధరలు అదే రీతిలో ఈరోజు కూడా పెరిగాయి. ఇక ధరలు ఎలా వున్నాయి అనేది చూద్దాం. తెలంగాణ హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.99కు చేరింది.

ఇది ఇలా ఉంటే డీజిల్ కూడా అదే దారిలో వెళ్తోంది. డీజిల్ ధర లీటరుకు 87 పైసలు పైకి చేరింది. దీంతో దీని రేటు రూ. 96.35కు ఎగసింది. తెలంగాణ లోనే కాదు ఏపీ లోను ఇదే పరిస్థితి. ఏపీ గుంటూరు అమరావతిలో పెట్రోల్ రేటు లీటరుకు 87 పైసలు పెరిగింది. రూ. 112.08కు చేరింది. డీజిల్ రేటు కూడా 84 పైసలు పెరిగింది. దీంతో డీజిల్ ధర రూ. 98.1కు ఎగసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. క్రూడ్ ధరలు మళ్లీ 115 డాలర్లకు పైన వుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.44 శాతం పెరిగింది. దీనితో ధర 116.13 డాలర్లకు చేరింది. ఇది ఇలా ఉండగా డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.61 శాతం పెరిగింది. దీంతో ఈ రేటు 109.92 డాలర్లకు ఎగసింది.

Read more RELATED
Recommended to you

Latest news