వరి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది- పీయూష్‌ గోయల్‌

-

వరి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఫైర్ అయ్యారు. ప్రతీ ఏడాది వరి కొనుగోళ్లు పెంచుతూ పోతున్నాం.. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల తర్వాత రబీ సంగతి చూద్దామన్నారు. ప్రతి రాష్ట్రంతో కేంద్రం (“అవగాహన పత్రం”) కు ఒప్పందం ఉంటుందని.. ఆ ఒప్పందం ప్రకారం దేశ వ్యాప్తంగా కేంద్రం ప్రతి రాష్ట్రం నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రం నుంచి బియ్యం ( వరి ధాన్యం) కొనుగోలు పరిమాణాన్ని పెంచుతూనే ఉందన్నారు.

బియ్యం కొనుగోలు పై ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్ధం కావడం లేదని.. ప్రస్తుత సీజన్ లో అందివ్వాల్సిన బియ్యాన్నే తెలంగాణ సరఫరా చేయలేకపోయుందని చురకలు అంటించారు. ముందుగా 29 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందివ్వాల్సిన తెలంగాణ ఇంతవరకు సరఫరా చేయలేదని.. ముందుగా దీనిని పూర్తి చేయండి. ఇంకా నిల్వలు ఏవైనా మిగిలీ ఉంటే, ఆ నిల్వలను కూడా ఏదోలా సర్దుబాటు చేస్తామన్నారు. తిరిగి, మరలా మరలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్ధం కావడం లేదన్నారు. ఇంకా రబీ సీజన్ రాలేదు. పాత పంట నిల్వలు ఏవైనా ఉంటే కూడా కేంద్రం సేకరిస్తుందని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news