తెలంగాణ‌ను అవ‌మానించే హ‌క్కు నీకెక్క‌డిది : హరీష్‌రావు

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ పై ఓ రేంజ్ లో రెచ్చి పోయారు మంత్రి హ‌రీష్ రావు. తెలంగాణ‌ రాష్ట్రాన్ని కించపరిచే హక్కు ఎవరిచ్చారంటూ ఆయ‌న‌పై హరీష్ రావు మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కలేఖ కూడా రాలేదని అబద్దాలు చెప్తున్నారని… కేంద్రానికి పది లేఖలు రాశామ‌న్నారు. కేంద్రానికి రాసిన లేఖలు చూపించిన మంత్రి హరీష్.. రైతులతో రాజకీయాలు అవసరమా అని ఆగ్ర‌హించారు.

మీకు బాధ్యత లేదా.. మా హక్కు పై నిలదీయటానికి వచ్చామ‌ని పీయూష్ గోయ‌ల్ పై ఫైర్ అయ్యారు. నిజాయితీ ఉంటే రైతులను చంపిన వాళ్ళను అరెస్ట్ చెయ్యండని సవాల్ విసిరారు. కేంద్రం చేతకానితనంతో డొంక తిరుగుడు ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

పీయూష్ గోయల్ వ్యాఖ్యలు.. తీవ్ర అభ్యంతరకరమ‌ని… తెలంగాణా ప్రజలను అవమాన పరిచారని ఆగ్ర‌హించారు. కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయం చేస్తున్నారని.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీకి వచ్చారని… పీయూష్ గోయల్ తన వాఖ్యలు ఉపసంహరించుకోవాలని మండిప‌డ్డారు.