స్టడీ: బాబోయ్.. పిజ్జాలు, బర్గర్లు ఇంత ప్రమాదమా..?

-

చాలామంది బయట దొరికే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు పిజ్జాలు బర్గర్లు ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు తింటూ ఉంటారు స్టడీ ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పింది. ఈ స్టడీ ద్వారా కొన్ని ముఖ్య విషయాలు తెలుస్తున్నాయి. వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. బయట ఇష్టం వచ్చినట్లు ఆహార పదార్థాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. బ్రిటన్ లో 18 ఏళ్ల అబ్బాయి బర్గర్ తినే చనిపోయాడు. అతని తండ్రి తన కొడుకు మరణము మీద ఇన్వెస్టిగేషన్ చేశారు ఇప్పుడు బర్గర్లు అమ్ముతున్న రెస్టారెంట్ల మీద కేసు వేశారు.

బర్గర్ తిన్న ఈ పద్దెనిమిదేళ్ల అబ్బాయి వాంతులు డయేరియా తో బాధపడ్డాడు ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లి అడ్మిట్ చేశారు అయితే అతను చనిపోవడానికి కారణం ఏంటంటే బర్గర్ వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ ఏ. బర్గర్ ని మజ్జిగలో నానబెట్టి వేడి చేసి ఇస్తున్నారని ఆ అబ్బాయి తండ్రికి తెలిసింది అయితే ఎలర్జీ రియాక్షన్స్ రావడం వలన ఆ పిల్లవాడు చనిపోయాడు. ముఖ్యంగా రెస్టారెంట్లు వాళ్ళు చేసే తప్పులు వలన బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రాణానికే ప్రమాదం కలగొచ్చు. అయితే జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే సడన్ గా మనం జంక్ ఫుడ్ ని మానేస్తే ఎక్కువ క్యాలరీ ఉండే ఆహార పదార్థాలు హై ఫాట్ ఫుడ్స్ మీద క్రేవింగ్ బాగా పెరిగిపోతాయి.

జంక్ ఫుడ్ లో ఉండే పంచదార సాల్ట్ వంటివి మన క్రేవింగ్స్ ని పెంచేస్తాయి దాంతో భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన ముఖ్యమైన పోషక పదార్థాలని మనం తీసుకోలేకపోతాము. విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ వంటివి అందవు. దీంతో పోషకాహార లోపం కలగవచ్చు. ప్రమాదకరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన ఊబకాయం మొదలైన సమస్యలు కూడా రావచ్చు. జంక్ ఫుడ్ ని మానేయడం కూడా అంత తేలిక కాదు కానీ జంక్ ఫుడ్ ని మానేయడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news