ఇంట్లో ఈ విగ్రహాన్ని పెడితే.. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఇబ్బందులు తొలగిపోయినట్లే..!

-

మనకు తెలియకుండానే ఇంట్లో ఉండే ఎన్నో వస్తువులు జీవితంలో ఎన్నో లాభాలను తీసుకొస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఎప్పుడైతే ఇంట్లో నెమలి విగ్రహాలను పెడతారో ఎంతో ప్రయోజనం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. నెమలి విగ్రహాలను ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించవచ్చు. సహజంగా చాలా శాతం మంది నెమలిని అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ఇది సంపదకు చిహ్నం. అందువలన నెమలిని ఇంట్లో పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను నయం చేసుకోవచ్చు.

అంతేకాకుండా జ్ఞానం, శక్తి, భద్రత వంటివి నెమలి చిహ్నంగా ఉంటాయి. దాని వలన ఇంట్లో నెమలి విగ్రహాన్ని ఉంచితే ఇంట్లో ఉండే వాతావరణం ఎంతో ఆహ్లాదంగా మరియు ఆనందంగా ఉంటుంది. వెండితో తయారుచేసిన నెమలి విగ్రహాన్ని ఇంట్లో పెడితే మరింత ప్రయోజనం ఉంటుంది. దీని వలన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు. వివాహ అడ్డంకులు ఉన్నట్లయితే, నెమలి విగ్రహాన్ని ఇంట్లో తప్పకుండా పెట్టాలి. ఇలా చేస్తే వివాహానికి సంబంధించిన అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి.

ఎప్పుడైతే నెమలి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుతారో ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దీనితో సంతోషంగా జీవించవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉండాలంటే వెండి నెమలి విగ్రహాన్ని తప్పకుండా ఇంట్లో పెట్టాలి. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి విగ్రహాన్ని ఈశాన్య దిశలో పెట్టడం వలన మరింత ప్రయోజనం అని పండితులు చెబుతున్నారు. కనుక ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడాలంటే, తప్పకుండా ఈశాన్య దశలో నెమలి విగ్రహాన్ని పెట్టండి. నెమలి విగ్రహం ద్వారా సానుకూల శక్తిని పెంచుకోవాలంటే, నెమలి విగ్రహం నృత్యం చేస్తున్నట్లు లేక కదులుతున్న స్థితిలో ఉండే విగ్రహాలను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news