సూర్యుడి ఉపరితలం పై గోడ వంటి ఆకృతిని గుర్తించిన అర్జెంటీనా పరిశోధకుడు

-

సూర్యుడి ఉపరితలం పై 62 వేల మైళ్ల ఎత్తు ఉన్న ఓ గోడ వంటి ఆకృతిని గుర్తించిన అర్జెంటీనా ఖగోళ పరిశోధకుడు ఎడ్వర్డో షాబెర్గర్ పోపీ సూర్యుడికి సంబంధించి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. సూర్యుడి ఉపరితలంపై 62 వేల మైళ్ల ఎత్తు ఉన్న ఓ గోడ వంటి ఆకృతిని గుర్తించారు. ఆ గోడ వంటి రూపం సూర్యుడి ఉపరితలం నుంచి ఉప్పొంగిన ప్లాస్మా కారణంగా ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. భూమి వంటి గ్రహాలను ఎనిమిదింటిని ఒకదానిపై ఒకటి నిలబెడితే ఎంత ఎత్తు ఉంటుందో ఈ ప్లాస్మా గోడ అంత ఎత్తు ఉన్నట్టు గుర్తించారు.

Plasma wall on Sun surface

దీన్ని రికార్డు చేసేందుకు పాపీ ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థను ఉపయోగించారు. పీసీపీలు సూర్యుడిపై ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాల నుంచి పెల్లుబికిన ప్లాస్మా లేక అయోనైజ్డ్ గ్యాస్ తో ఏర్పడతాయని వివరించారు. కాగా, సూర్యుడిపై ఇలా ప్లాస్మా ఉవ్వెత్తున ఎగసిపడడం సాధారణమేనని, గతంలోనూ వీటిని గుర్తించారని, వీటిని పోలార్ క్రౌన్ ప్రామినెన్స్ (పీసీపీ) అంటారని లైవ్ సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన ఓ నివేదికలో పేర్కొన్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news