కొత్తగా కనిపించాడనికి కారకుడు సూరి : అఖిల్

-

సురేందర్ రెడ్డి దర్శకత్వం లో హీరో అఖిల్ నటిస్తున్న “ఏజెంట్” సినిమా ప్రేక్షకుల ముందు రాడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది “ఏజెంట్” సినిమా. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ .. “ఈ కథ చెప్పడానికి వచ్చినప్పుడే, ‘నేను ఇబ్బంది పెడతాను .. మీరు పడాలి’ అని సూరి ముందుగానే చెప్పాడు” అని అన్నాడు.” ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వడం మొదలైన దగ్గర నుంచి, అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడని చాలామంది అన్నారు.

Agent movie press meet

అలా కనిపించడానికి కారకుడు సురేందర్ రెడ్డినే. గట్టిగా ట్రై చేస్తే సిక్స్ ప్యాక్ ఎవరైనా సాధించవచ్చు. కానీ ఈ సినిమా వలన నేను మెంటల్ స్ట్రెంత్ ను సంపాదించాను. ఈ సినిమా చేసినందుకు చాలా సంతృప్తికరంగా ఉన్నాను” అని వ్యక్తపరిచారు అఖిల్.” ఇక మమ్ముట్టి గారి గురించి ఏం మాట్లాడమంటారు? ఆయన వందల్లో సినిమాలు చేశారు. ఆయన సెట్లో ఉంటేనే ఆయన చుట్టూ ఒక ఆరా ఉన్నట్టుగా అనిపించేది. తెలుగులోనే ఆయన మాట్లాడేవారు. అలంటి ఒక సీనియర్ స్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అని తన సంతోషాన్ని తెలియచేసాడు అఖిల్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news