రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లో రూ.4 వేలు !

-

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా ఏకంగా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతలవారీగా ఖాతాలలో వేసుకుంది. మధ్యవర్తుల తో ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు అధికారులు.

farmer
farmer

ఇందులో భాగంగానే ఇప్పటికే 9 విడతల డబ్బులను అందజేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే పదో విడత పీఎం కిసాన్ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. డిసెంబర్ 15వ తేదీన పదవీ డబ్బులను కేంద్రం విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈసారి రెండు వేలకు బదులు రైతుల ఖాతాల్లో రూ.4000 వేలు వేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది.

అయితే సెప్టెంబర్ 30 లోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అందుతాయని పేర్కొంది. అలాగే ఈ సారి కొంత మంది రైతులకు డబ్బులు రావని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే లబ్ధిదారుల్లో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే వ్యాపారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news