ఒకే వేదికపై మోదీ-శరద్‌ పవార్‌.. ఇండియా కూటమి నేతలు అసంతృప్తి

-

ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టేందుకు విపక్షాలన్ని ‘ఇండియా’ పేరుతో ఏకం అయ్యాయి. ఈ కూటమి బలోపేతానికి విపక్ష పార్టీలు కృషి చేస్తున్నాయి. వచ్చే నెలలో ముంబైలో ఇండియా కూటమి నేతల మూడో సమావేశం జరుగనున్నది. ఈ క్రమంలో వచ్చే నెల 1న పుణేలో జరిగే కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రధాని నరేంద్రమోదీతో వేదిక పంచుకోనుండటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానికి లోకమాన్య తిలక్‌ అవార్డు ప్రదానం చేసే కార్యక్రమానికి శరద్‌ పవార్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శుక్రవారం నిర్వహించిన ఇండియా కూటమి ఫ్లోర్‌ లీడర్ల సమావేశంలో కొందరు సభ్యులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Surprised over Modi giving 'religious' slogans: Sharad Pawar | Deccan Herald

పవార్‌తో మాట్లాడి ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా చూడాలని వారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరినట్టు సమాచారం. ఈస్టిండియా కంపెనీ, ఇండియా ముజాహిదీన్‌ అంటూ ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీతో శరద్‌ పవార్‌ వేదిక పంచుకుంటే తప్పుడు సందేశం పంపినట్టు అవుతుందని వారు అభిప్రాయపడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటికి వస్తున్న క్రమంలో.. మోదీ సన్మాన కార్యక్రమానికి పవార్‌ హాజరుకావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇండియా కూటమిలో పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news